తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోబోతున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎమర్జెన్సీ సర్వీసుతో పాటుగా ఆక్సిజన్ ను సిలిండర్లను సిద్ధం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఓటర్లు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.