మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీకి ‘కొండా’ అని నామకరణం కూడా చేశాడు. ఈ సినిమా నేపథ్యం వరంగల్ జిల్లా కాబట్టి ఎక్కువ భాగం సినిమా షూటింగ్‌ను వరంగల్, ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరపాలని తొలుత నిర్ణయించారు. కానీ ఈ సినిమాపై పలువురు రాద్ధాంతాలు చేస్తున్నందున తాజాగా షూటింగ్ స్పాట్ మార్చినట్లు వర్మ తెలిపాడు.
Read Also: ఒకేసారి నాలుగు చిత్రాలలో నిఖిల్
‘కొండా’ మూవీ షూటింగ్‌ను వరంగల్‌లో కాకుండా ఏలూరులో జరుపుతున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలియజేశాడు. 15 రోజుల పాటు ఈ మూవీ చిత్రీకరణను ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే తీస్తామన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న బోసడీకే అనే పదం గురించి అర్థం తెలుసా అని పలువురు మీడియా ప్రతినిధులు వర్మను అడగ్గా… ఆ పదానికి తనకు అర్థం తెలియదని, డిక్షనరీలు చూసేంత సమయం తన దగ్గర లేదని సమాధానమిచ్చాడు. కాగా గతంలో వర్మ బెజవాడ, వంగవీటి, రక్తచరిత్ర అంటూ పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలను తీసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.