ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు.
పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక వైపు పేదల పక్షాన ఉన్నామంటానే పోడు పేరుతో ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నది నిజం కాదా అని లేఖలో ప్రశ్నించారు.
తెలంగాణ అడవుల్లో నెత్తు రోడిస్తూనే మరోపక్క కల్ల బొల్లి మాటలతో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ లేఖలో చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రీజనల్ సెంటర్ సీ ఆర్‌సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్స్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ఏరియాకు చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లాలోని పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకు చెందిన కామ్రేడ్లు మరణించినట్టు జగన్ లేఖ ద్వారా ప్రకటించారు.