కాకతీయ యూనివర్సీటీ పరిధిలో జరిగిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షా ఫలితాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు కళాశాల ప్రన్సిపాల్ మనోహార్ వివరాలు తెలిపారు. బీఎస్సీ, బీకామ్, బీఏ, డిగ్రీ మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు తెలియజేశారు. విద్యార్థులు అధికారిక సైట్‌లో తమ ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. లేదా కాలేజీలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. హనుమంతు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.