Waqf bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.
MK Stalin: తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు చిగురించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ భేటీపై సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లు…
Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి…
RSS: ఔరంగజేబు సమాధి వివాదం నడుస్తు్న్న వేళ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. ‘‘ భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధిస్తున్నామా..? ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు’’ అని అన్నారు.
Waqf Bill: బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘‘వక్ఫ్ బిల్లు’’పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, మైనారిటీలను చెడుగా చూపిస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు.
అయితే, తాజాగా ఎంఐఎం నేత ఇమ్రాన్ సోలంకి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోల్‌కతాలోని క్రికెట్ స్టేడియం ‘‘ఈడెన్ గార్డెన్’’ కూడా వక్ఫ్ ఆస్తి అని క్లెయిమ్ చేశారు. భారత సైన్య తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫోర్ట్ విలియ కూడా వక్ఫ్ ఆస్తి అని పేర్కొన్నారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో వక్ఫ్‌కు 105 ఆస్తులు ఉన్నట్లు ఇమ్రాన్ చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం.
Waqf bill: సోమవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వక్ఫ్ బిల్లుని ఆమోదించింది. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి నివేదికను సమర్పించారు. బిజినెస్ లిస్ట్ ప్రకారం.. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జే
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కమిటీలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన అన్ని సవరణలకు జేపీసీ ఆమోదం తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ప్రతీ మార్పును కమిటీ తిరస్కరించింది. బిల్లులో 14 నిబంధనలలో ఎన్డీయే సభ్యులు ప్రతిపాధించిన సవరణలు ఆమోదించినట్లు పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్ అయిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దుమారం రేగింది. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన మార్పులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై... జాయింట్ కమిటీ కాశ్మీర్ మత గురువు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అభిప్రాయాలను వినేందుకు సిద్ధమైంది. మిర్వాయిజ్‌ను పిలవడానికి ముందు.. కమిటీ సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఢిల్లీ…