Asaduddin Owaisi: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) త్వరలో అమలు చేయబోతున్నారు. అక్కడ పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ యూసీసీ అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే, దీనిపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ‘‘హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టాలకు మినహాయింపు ఇస్తునప్పుడు దీనిని యూనిఫాం సివిల్ కోడ్’’గా పిలువలేము అని అన్నారు.
Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్‌లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది.
Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు.
Waqf: కేంద్ర వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇప్పటికే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉన్నా, కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు పెంచారు.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు.
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.
Parliament Winter session: ఇవాళ్టి (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సెషన్స్ కొనసాగనున్నాయి. సెలవులు తీసి వేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి.…
Lavu Krishna Devarayalu : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ…