Waqf amendment bill: ఎన్డీయే ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’కు మిత్ర పక్షాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే, టీడీపీ, జనసేన పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు.
ట్రంప్ సుంకాలపై ఉత్కంఠ.. భారత్‌పై ప్రభావం.. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది. ట్రంప్ కొన్నాళ్ల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటున్న ‘‘పరస్పర…
Waqf Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చించనున్నారు. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగుతుంది. ప్రతీ సభలో చర్చించడానికి 8 గంటలు కేటాయించారు.
Kesineni Nani: ప్రస్తుతం పార్లమెంటులో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2024 పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై మాజీ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వెల్లడించారు.
Waqf Bill: ఎన్డీయే ప్రభుత్వం చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును ఈ రోజు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే అధికార బీజేపీ కూటమి సంఖ్యా బలం, ఇతరత్రా లెక్కలతో సిద్ధమైంది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి.
Waqf bill: బుధవారం పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రాబోతోంది. లోక్‌సభలో ముందుగా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. చర్చ తర్వాత రాజ్యసభకు పంపనున్నారు. అయితే, ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి. మూడు రోజుల పాటు సభకు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశాయి.
Devendra Fadnavis: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏప్రిల్ 02న లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనుంది. సభలో బిల్ పాస్ కావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరు పార్టీలు తమ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. రాబోయే మూడు రోజులు సభకు ఖచ్చితం రావాలని ఆదేశించాయి.
Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రేపు, ఉదయం ఇండీ కూటమి ఎంపీలతో…
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంతో పాటు వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చే బిల్లుపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షాలు వాకౌట్ ను ఒక సాకుగా చెబుతున్నాయని ఆరోపించారు.