Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన "చాలా తెలివైన వ్యక్తి" అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు.
రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్లు వెల్లడించింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది.
PM Modi: ఉక్రెయిన్ యుద్ధం, సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా తిరుగుబాటు గురించి ఇరువురు నేతలు సంభాషించారు. ఏ రకంగా తిరుబాటును పరిష్కరించారే వివరాలను పుతిన్, మోడీకి వివరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ యుద్ధంలో రష్యా కొంత వరకు ఆక్రమించింది. తిరిగి దానిని కోల్పోయింది. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్ట పోయింది.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు.