Putin: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు శనివారం భారీ దాడికి తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల్లోనే 5000 వేల రాకెట్లను ప్రయోగించారు. ఈ పరిణామంతో ఇజ్రాయిల్ షాకైంది. అయితే తేరుకునేలోపే వందల మందిని సరిహద్దు దాటి వచ్చిన మిలిటెంట్లు పిట్టల్లా కాల్చి చంపారు. 1000 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్, ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య హింస చెలరేగడానికి అమెరికా పాలసీ వైఫల్యం కనిపిస్తోందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ విమర్శించారు. మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని.. చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని, రష్యా పర్యటనలో ఉన్న ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీతో అన్నారు.
Read Also: Israel: యుద్ధంలోకి 3 లక్షల మంది రిజర్వ్ సైన్యం.. హమాస్‌ని తడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్..
ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా యత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదుర్చడంలో వాషింగ్టన్ నిర్లక్ష్యం వహిస్తోందని పుతిన్ పుతిన్ విమర్శించారు. అమెరికా స్వతంత్ర పాలస్తీనా దేశ ఆవశ్యకతను విస్మరించిందని దుయ్యబట్టారు. వెస్ట్ బ్యాంక్, గాజాస్ట్రిప్ తో జెరూసలెం రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 1967 యుద్ధంలో జెరూసలెంని ఇజ్రాయిల్ ఆక్రమించింది. రష్యా ఇరు దేశాలతో టచ్ లో ఉందని, వివాదాన్ని పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పుతిన్ చెప్పారు.