Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన “చాలా తెలివైన వ్యక్తి” అని, మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెంతుతోందని ఆయన పొగిడారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో రష్యా, భారత్ మధ్య మరింత సహకారం ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Temba Bavuma Sleep: నేను నిద్రపోలేదు.. కెమెరా యాంగిలే సరిగా లేదు: దక్షిణఫ్రికా కెప్టెన్
పుతిన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీతో మాకు చాలా మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయని, ఆయన చాలా తెలివైన వ్యక్తి అని, ఆయన నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారత్ తో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. భారత్ లో జరిగిన జీ20 సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో రష్యా యుద్ధం గురించి ప్రస్తావించకుండా, శాంతి గురించి భారత్ నొక్కిచెప్పడం ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశాయని అన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ని మాస్కో స్వాగతించింది. ఇది కీలక మైలురాయని రష్యా అభివర్ణించింది
జీ20 దేశాలను ఏకీకృతం చేయడంలో భారత అధ్యక్ష పదవి క్రియాశీలక పాత్ర పోషించిందని రష్యా ప్రశంసించింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించి సరైన పనిచేస్తున్నారని పుతిన్ అన్నారు. రష్యా కూడా దేశీయ పరిశ్రమల్ని ప్రోత్సహించాలని ఆయన పలుపునిచ్చారు.