కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం టు భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. లోకో పైలట్ ఎం.హెచ్.ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరగా.. గంట వ్యవధిలోనే కొత్తవలస…
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు విజయనగరంలోని లైఫ్ లైన్ ఏజెన్సీ టోకరా వేసింది. సుమారు 125 మంది నుంచి 75 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తుంది.
విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో ఈ ఇనిస్టిట్యూట్ వంద ఎకరాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని తెలిపారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇది తయారు కావాలన్నారు. ఇందుకోసం ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు.. అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోటీ పరీక్షలో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి…
విజయనగరం జిల్లా మహారాజుపేట గ్రామములో వృద్దురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకుడు విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన ఇజ్జరపు కుర్మారావుగా పోలీసులు వెల్లడించారు. హంతకుడు కూర్మారావు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు.
Vizianagaram: వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా రోగికి వైద్య సేవలు అందించి మనిషి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. అందుకే వైద్యుడిని దేవునితో పోల్చారు. కానీ ప్రస్తుతం కొంత మంది డాక్టర్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయింది అన్నట్లు.. జలుబు చేసి దవాఖానకు వెళ్లిన ప్రాణాలతో తిరిగి వాస్తవమన్న గ్యారెంటీ లేదంటున్నారు ప్రజలు. పైసా మే పరమాత్మ అన్నట్లు ఉంది కొందరు…
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది.. అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.