Vizianagaram: ఎక్కడ ఆడవాళ్లు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడవాళ్లు పూజింపబడం అంటుంచింతే కనీసం గౌరవింపబడడం లేదు. కొందరి వ్యక్తుల ఆకతాయి వేషాల వల్ల అవతలి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యం బాగా లేదంటూ హాస్పిటల్ కి వచ్చి అక్కడ లేడీ డాక్టర్స్ తో హౌస్ సర్జన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి మంచి చెడులకు మధ్య వ్యత్యాసం తెలియకుండా లేడీ డాక్టర్లతో, హౌస్ సర్జన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో ప్రభుత్వ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ డాక్టర్లు, హౌస్ సర్జన్స్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Read also:Kishan Reddy: నేడు ఢిల్లీకి కిషన్ రెడ్డి.. బీజేపీ మూడో జాబితాపై అగ్రనేతలతో చర్చ..
ఇలా ఆకతాయి చేష్టల వల్ల డాక్టర్లు, సర్జన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా అలాంటి ఘటనే విజయనగరంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. చేతికి గాయం అయ్యిందని ఓ వ్యక్తి విజయనగరం లోని ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఓపీ కోసం ఓ హౌస్ సర్జన్ అతని దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి హౌస్ సర్జన్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన తోటి హౌస్ సర్జన్ రాజు నువ్వు చేస్తున్నది తప్పు అని ఆ ఆకతాయిని వారించాడు. దీనితో ఆ ఆకతాయి హౌస్ సర్జన్ రాజుకి ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో మెడికోస్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు ఇలానే కొనసాగితే విధులు నిర్వర్తించడం కష్టమని ఆందోళన చెందుతున్నారు. కాగా జరిగిన ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసారు.