Vijayanagaram: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు సుమారు 30 మందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు అనుకొని ఉన్న క్లాస్…
Off The Record: విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఊహించని రీతిలో మారుతోంది. పైడితల్లి అమ్మవారి పండగ సాక్షిగా జరిగిన వ్యవహారాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. విజయనగరం ఉత్సవాలు, మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి వంగలపూడి అనిత హడావిడి, పబ్లిసిటీతో అటెన్షన్ తనవైపు డైవర్ట్ చేసుకోగా… ఆ ప్రభావం లోకల్ గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై పడ్డట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి బాగా….. ఎక్కువ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. పైడితల్లి అమ్మవారి పండగ సమయంలో…
Botsa Satyanarayana: శాసనమండలి విపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.. పైడితల్లి పండుగలో తనని అవమానించాలనో.. అంతమొందించాలనో కుట్ర చేశారా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చాం.. కానీ, అది పట్టించుకోలేదు.. ఇది కుట్రతో జరిగిందా..? లేక అధికారుల అలసత్వమా? మమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశమా? లేక అంతమొందించాలన్నదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Read Also: UP: 48 గంటల్లో 20 ఎన్‌కౌంటర్లు..! నేరస్థులను…
Ashok Gajapathi Raju: అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చేయాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలని సూచించారు మాన్సస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చెయ్యాలన్నారు.. రకరకాల సేవులున్నాయి.. అందరం కలిసి చెయ్యాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలన్నారు.. అమ్మవారికి సేవ చేసే బాధ్యత నాపై మా పెద్దలు ఉంచారు.. అలాగే నడుచుకుంటున్నాం.. పారదర్శకత…
Red Alert for Uttar Andhra: ఏపీలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాలో కుండపోత వాన కురిసే అవకాశం ఉంది. ఇవాళ (అక్టోబర్ 5న) తెల్లవారుజాము నుంచే ఎడతెరపి లేని వర్షం కురవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Tribal Students Death: పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యంతో గిరిజన విద్యార్థినుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పార్వతీపురం పరిధిలోని కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండిస్ లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంచలనం రేపుతున్నాయి.
విజయనగరంలో బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) డీజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్స్‌కు హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
Daughter Helps Mother Deliver Baby: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తల్లికి కూతురే పురుడుపోసింది. ఇది పరిషత్ కార్యాలయం చుట్టుపక్కల వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. తల్లి, బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువుకు డాక్టర్లు అత్యవసర వైద్యం అందించారు. తల్లి, శిశువును సురక్తితంగా ఉన్నారు. గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని అక్కేన వలస గిరిజన గ్రామానికి చెందిన దుబ్బాక పార్వతి…
విజయనగరం జిల్లాలో మైనింగ్ మాఫియా…అసిస్టెంట్ జియాలజిస్ట్ను కాపాడుతోందా ? ప్రభుత్వాలు మారినా…సదరు అధికారి మారడం లేదా ? కుర్చికీ ఫెవికల్ వేసుకొని…కదలనని అంటున్నారా ? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా…ఫలితం లేకుండా పోతోందా ? అంతలా అసిస్టెట్ జియాలజిస్ట్ పరపతి ఉపయోగిస్తున్నారా ? ఏపీలో మైనింగ్ మాఫియా ప్రభావం రోజురోజుకీ పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బు కట్టలు విసురుతూ, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని, అధికారులను ప్రభావితం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. తమ అక్రమ…
విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంగర మండలం బాగెంపేటలో గత నాలుగు రోజుల క్రితం శంకర్రావు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చోరీ జరిగింది.. ఈ ఘటనలో 20 తులాల బంగారం అపహరణకు గురైంది.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు..