Srungavarapu Kota: విజయనగర జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజుకుంది. ఈ టికెట్ కోసం కోళ్ల లలిత కుమారి, గొంప కృష్ణ పోటీపడ్డారు. దీంతో మొదటి రెండు జాబితాల్లో ఈ నియోజకవర్గం పక్కన పెట్టింది అధినాయకత్వం. ఎట్టకేలకు కోళ్ల లలితకుమారికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో, టికెట్ ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ వర్గం ఆగ్రహానికి లోనైంది. అయితే, శోభా హైమావతి పార్టీని వీడాక.. ఎస్-కోటలో టీడీపీని ని నిద్రాణ దశకు చేరింది. ఇలాంటి సమయంలో క్యాడర్‌ని ఉత్తేజపర్చారు గొంప కృష్ణ. పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి.. ముఖ్యంగా యువతను ఆకట్టుకోడానికి చర్యలు చేపట్టారు. యువజన సంఘాలకు క్రికెట్లను అందజేశారాయన.
Read Also: Viral: రీల్ కోసం వీడియోకు ఫోజులిచ్చిన మహిళ.. చైన్ లాక్కెళ్లిన దొంగ
అయితే, కృష్ణను అడ్డుకోడానికి కోళ్ల ఫ్యామిలీ ప్రయత్నించినా.. చంద్రబాబు పరోక్షంగా ప్రోత్సహించారని టాక్. ఇది కాస్త నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడేలా చేసింది. పోటీపోటీ కార్యక్రమాలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్ల లలితను నియోజకవర్గం ఇన్‌చార్జిగా ప్రకటించి… గొంప కృష్ణను రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. కానీ, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదరలేదు. చివరికి కోళ్ల లలితకు టికెట్ ఇవ్వడంతో గొంప కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోనని తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు.