పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆహ్వానించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు.. నేడు భారతదేశ పార్లమెంట్ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసినట్టు వెల్లడించారు..
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.. విజయనగరం జిల్లా రామభద్రపురం సమీపంలోని భూసాయవలస వద్ద మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం సంభవించింది.. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో.. ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం.. ఓ వ్యాన్‌ను ఢీ కొట్టింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
రేపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. జిల్లాలోని కళాశాలలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.
ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది.. కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు.. ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. భర్త బండారాన్ని బయటపెట్టింది.. రెడ్ హ్యాండెడ్‌గా పెట్టుకుని.. పోలీసులకు అప్పగించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో…
విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుంది. ఉత్తరంవైపుగా కదులుతూ రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.