Double-Decker Buses: చాలా కాలంగా ఎదురు చూస్తున్న అతిథి విశాఖకు వచ్చింది. బీచ్ టూరిజంకు అదనపు ఆకర్షణగా చేరింది. బీచ్ రోడ్డులో షికారు చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెండు బస్సులను అధికారులు తీసుకుని వచ్చారు. బీచ్ రోడ్ కైలాసగిరి వరకు ఈ రైడ్ ప్లాన్ చేస్తున్నారు. డిమాండ్ ఆధారంగా భీమిలి వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. అయితే, విశాఖలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సులు సహకరించనున్నాయి. సింహాచలం ఘాట్ రోడ్డులో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది.
Read Also: Polavaram-Banakacherla Project: పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్పై కేంద్ర ఆర్థికశాఖ అధికారుల భేటీ
కాగా, విజయవాడ సమీపంలో బస్ బిల్డింగ్ ప్లాంట్ ప్రారంభించిన అశోక్ లేల్యాండ్ కంపెనీ వీటిని తయారు చేసింది. డబుల్ డెక్కర్ బస్సులను ఏపీ ప్రభుత్వానికి ఇటీవల అందజేసింది. ఆ డబుల్ డెక్కర్ బస్సుకు విశాఖకు కేటాయించారు అధికారులు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుందని సిబ్బంది చెప్తున్నారు. గతంలో హైదరాబాద్ లో పర్యాకులకు డబుల్ డెక్కర్ బస్సు అనుభూతి కలిగేది.. ఇప్పుడూ ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు విశాఖ టూరిస్టులకు అందుబాటులోకి వచ్చింది.