BJP MP Laxman: ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ అన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధాని మోడీ.. వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వర్ణ యుగానికి నాంది పలికారు మోడీ.. నాలుగవ అతి పెద్ద ఆర్ధిక దేశంగా భారత్ ను నిలిపిన ఘనత అయన సొంతం.. రేంద్ర మోడీ ఒక విజినరి లీడర్.. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను శక్తివంతంగా ఎదుర్కున్నామని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత..
ఇక, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనే విదంగా ముందుకు వెళ్తున్నారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సాహోపేత నిర్ణయాలు తీసుకొని ఎన్నో ఘన విజయాలు సాధించారు.. దారిద్ర రేఖ దిగువ ఉన్న వారికీ ప్రగతి ఫలాలు అందించాలనేది తపన.. గత ప్రభుత్వం 11 లక్షల కోట్లకు అవినీతి చేసింది.. 55 కోట్ల ప్రజలకు 44 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలు సృష్టించి లబ్దిని చేకూర్చారని ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా దళారులకు చెందకుండా నేరుగా ప్రజలకే ప్రయోజనం చేకూర్చారు.. రాజీవ్ గాంధీ పాలనకు, మోడీ పాలనకు తేడా ఇది.. 370 ఆర్టికల్ రద్దు, రామ మందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు పెద్దన్న పాత్ర.. 33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోడీది అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు.
Read Also: KCR Live Updates: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. లైవ్ అప్డేట్స్!
అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా రైల్వే బ్రిడ్జి కాశ్మీర్ లో నిర్మితం అయింది అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. జీఎస్టీ ప్రవేశం, పెద్ద నోట్ల రద్దు అవినీతి బ్లాక్ మనీని వెలుగు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఒక్క నెలలోనే రెండు లక్షలు కోట్ల నగదు చేకూరింది.. సమ న్యాయం సమ దృష్టితో ఏపీని స్వర్ణాంద్ర ప్రదేశ్ గా రూపు దిద్దుతున్నారు అని కొనియాడారు. రైల్వేస్, ఎయిర్ వేస్, రోడ్ వేస్ అన్నింటిని ఢిల్లీకి నేరుగా అనుసంధానం చేస్తున్నారు.. రాజకీయలకు అర్ధం ప్రధాని మోడీ మార్చేశారు.. వక్ఫ్ బిల్లు ప్రవేశ పెడితే నెగిటివ్ ప్రచారం చేశారు.. ముస్లిం లా హక్కులను కాలరాస్తున్నారని బీజీపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.