SC Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్టణం- సికింద్రాబాద్, విశాఖ- మహబూబ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 1 వతేదీ నుంచి జూన్ 29 వరకు ఈ వారాంతపు రైళ్లను నడపనుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ రైలు జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో రైలు బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 08579/08580.. తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.40కి విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
Also Read
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు ఆంధ్రా, తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో వారాంతపు రైళ్ళు ఆగుతాయి. విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ రైలు ట్రైన్ నెంబర్ 08585/08586 జూన్ నెల 7 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి మంగళవారం విశాఖలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, కాచిగూడ, జడ్చర్ల మీదుగా ప్రయాణించి తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!