Child Trafficking: విశాఖపట్నంలో చైల్డ్ రాకెట్ సంచలనంగా మారుతుంది. ఆసుపత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లక్షల రూపాయలకు అమ్మేస్తున్నాయి ఘరానా ముఠాలు. కొన్ని కేసుల్లో బంధువులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంగా ఉండటంతో మరింత కలవర పాటుకు గురి చేస్తోంది.
Snake Enter In Bank: విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. వదలపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఇవాళ జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.
Fire Accident in Vizag Dino Park: విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డైనో పార్క్ రెస్టో కేఫ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాండురంగాపురం మత్స్య దర్శని పక్కనే ఉన్న డైనో పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డైనో పార్క్ రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు…
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ ఫైల్ చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో మొదలైన మంటలు.. ఇతర బ్లాకుల్లోకి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లకు ఇబ్బంది తలెత్తకుండా ఆస్పత్రి సిబ్బంది చర్యలు చేపట్టారు.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త బలయ్యాడు. మృతుడు విశాఖలోని ఓ ప్రయివేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరి ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
విశాఖలోని బీచ్ రోడ్డులో హ్యాండ్లూం శారీ వాక్ కలర్ఫుల్గా జరిగింది. సూర్యోదయం కాగానే వేలాది మహిళలతో చేపట్టిన శారీ వాక్ సంప్రదాయాలను చాటి చెప్పింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ శారీ వాక్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మంత్రి కూడా వైజాగ్ మహిళలతో కలిసి శారీ వాక్ చేశారు.