సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. కానీ.. దాదాపు కిడ్నీ మొత్తం ఆవరించి, బయట కటివలయంలోకి కూడా వచ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండడం చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 80 మి.మీ. కంటే పొడవున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెరగడంతో మూత్రనాళానికి అడ్డం పడదు, దాంతో నొప్పి తెలియదు, వాపు కూడా అంతగా ఉండదు. అందువల్ల రోగులకు ఇది ఉందనే విషయమే తెలియదు. ఇలాంటి తీవ్రమైన సమస్యను అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తొలగించారు…
Ganta Srinivasa Rao: స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం, మా నినాదం అని., నా రాజీనామాపై చౌకబారు విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఐదేళ్లు అధికారంలో వుండి.. స్టీల్ ప్లాంట్ కోసం ఏమీ చేశారు.. గాడిదెలు కాశారా..? మేము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించాము. రాజీనామలు వల్ల ఉపయోగం లేదంటే ఆది మీ ఆవివేకం.. రాజీనామలు చేస్తే ప్రభుత్వలు కదలి వస్తాయి.. రాజీనామలు వల్ల ఉపయోగం లేకపోతే జగన్ ఎందుకు రాజీనామలు చేసి…
విశాఖ రైల్వే జోన్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు.
విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. విశాఖ జంక్షన్లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ వందేభారత్ రైలు నిలిచింది. ఏపీ,ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు ప్రయాణించనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో…
భిన్నంగా గణపతిని అలంకరించే విధానంలోనూ డిఫరెంట్ ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో నుంచి రూపుదిద్దుకున్నదే బెల్లం గణపతి. గాజువాక బడ్ డిపో దగ్గర లంబోధర అసోసియేషన్ 70 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహం ఏర్పా టు చేసింది. సుమారు 18 టన్నుల బెల్లం ఇందు కోసం వినియోగించారు.