విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో…
భిన్నంగా గణపతిని అలంకరించే విధానంలోనూ డిఫరెంట్ ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో నుంచి రూపుదిద్దుకున్నదే బెల్లం గణపతి. గాజువాక బడ్ డిపో దగ్గర లంబోధర అసోసియేషన్ 70 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహం ఏర్పా టు చేసింది. సుమారు 18 టన్నుల బెల్లం ఇందు కోసం వినియోగించారు.
రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం అమలు చేస్తామని.. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫేజ్ రీయింబర్స్మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం అన్నారు.. విశాఖపట్నం రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
అనకాపల్లి నుంచి అనందపురం వరకు ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను ప్రయోగత్మకంగా ప్రారంభించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆటో నంబరు ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సిగ్నలింగ్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు..
KGH Hospital: విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు తన చాంబర్లో.. బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.