YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు..
Read Also: Guinness World Record: గిన్నిస్ రికార్డుల సంఖ్య.. సచిన్‌ను అధిగమించిన ఢిల్లీ వాసి!
అచ్యుతాపురం ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు.. మెడికవర్ ఆసుపత్రిలో ఏడుగురు బాధితులు, కిమ్స్ లో ఐదుగురు బాధితులు.. ఉష ప్రైమ్ ఆస్పత్రిలో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.. ప్రమాదంలో ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఈ రోజు అనకాపల్లిలో బాధితులను పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మరోవైపు.. గురువారం రోజు క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. పూర్తిస్థాయిలో కోలుకునేవరకు వైద్యం అందిస్తామని తెలిపారు.. మృతుల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ఓదార్చారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. ఇక, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు.. గాయపడినవారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స బాధితులను పరామర్శించిన విషయం విదితమే..