Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం..
- కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం
- కస్టడీలో కీలక సమాచారం రాబట్టిన భీమిలీ పోలీసులు
- జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్
- కీలకంగా మారిన ల్యాప్ టాప్.. హార్డ్ డిస్క్ లోని డేటా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిలాడీ లేడీ జాయ్ జెమిమా హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేమిమాను కస్టడీలో తీసుకున్న భీమిలీ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీపీ.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లోని డేటా కీలకంగా మారింది. అయితే.. తెలివిగా ముందే మొబైల్‌లోని కీలక డేటాను ల్యాప్ టాప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంది కిలేడి. ఈ క్రమంలో.. ఫోన్ పే వంటి నగదు ట్రాన్సాక్షన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా.. పోలీసుల వద్ద కిలేడీ ఏడుస్తూ తననే మోసగించారని డ్రామాలు చేసింది. అయితే.. ఈ కిలేడీ లేడీ ట్రాప్ చేసి పలువురి దగ్గర నుండి లక్షలు కాజేసింది. ఫోటో షూట్‌ల కోసం, రీల్స్ కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది జాయ్ జెమిమా. కాగ.. ఈ కేసులో మరోసారి మహిళను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.
Read Also: Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్‌గేట్స్ నివాళి..
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
మాయ లేడీ జాయ్ జేమియా.. 10 నెలల కిందటే ఈ ఏడాది జనవరిలో వ్యాపారవేత్త బీన్ బోర్డ్ డైరెక్టర్ ఎడ్ల ఐజాక్ జెరేమియను హాని ట్రాప్ చేసి.. రేప్ కేసు పెట్టించింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో దీనిపై FIR నమోదు చేశారు. ఆ సమయంలో జేమియ మోసాలను గుర్తించలేకపోయిన పోలీసులు.. అప్పుడు విచారణ లేకుండానే బాధితుడిపై రేప్ కేసు నమోదు చేశారు. అయితే.. అదే వ్యక్తి హాని ట్రాప్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. అసలు బండారం బయటపడింది. ఇలా చాలా మందిని ట్రాప్ చేసిన కిలేడీ.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేది. ఈ క్రమంలో.. అమెరికాలో ఉంటున్న విశాఖకు చెందిన మురళీ అనే వ్యక్తిని మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేసింది. పెళ్లి చేసుకోవాలని బెదిరించేది.. లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేది. ఈ క్రమంలో.. ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించి అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు మురళీనగర్ లో జెమీమాను అదుపులోకి తీసుకుని.. ఆమె నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు.
Read Also: CPI Narayana: జగన్ పై ఉన్న కోపాన్ని లడ్డూపై చూపించారు.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!