విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సీఎం జగన్ గతంలోనే చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్…
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు చంద్రబాబు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి ప్రైవేటీకరణకు ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151…
కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తోంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనానికి జనసేనే గుర్తుకు రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని మేం శత్రువుగా చూడడం లేదు.. కానీ ఆ ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే మేం విమర్శలు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే పచ్చి బూతులు తిడతారు.. ఇంట్లో వాళ్లని తిడతారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏదో చిన్న పరిశ్రమ కాదు.. ఆత్మగౌరవం. నేను బీజేపీతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవాలని…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్ధతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి స్టీల్‌ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని పదేపదే చెబుతూ వస్తోంది. కేంద్రం తీరు మార్చుకోకపోవడంతో ఇవాళ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు పవన్ . ఉదయం 10 నుంచి సాయంత్రం…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ఇప్పటికే సిద్దమైంది. దీనిపై అటు కేంద్రకేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేయబోతున్నారనే వార్తలు వచ్చాయో అప్పటి నుంచే ఉక్కుకార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, దీక్షలు, పోరాటాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు కార్మికులకు మద్దతు తెలిపారు. Read: వావ్: రెండే…
తూర్పుగోదావరి జిల్లా : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని ఈ లేఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు ముద్రగడ పద్మనాభం. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని… కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా… ప్రైవేటీకరణ చేయడం అస్సలు తగదని ఆయన తెలిపారు. రైతుల సహకారం కోసం మూడు వ్యవసాయ బిల్లులు…