ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! అంటూ కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.