విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సీఎం జగన్ గతంలోనే చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.
గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. చిత్తశుద్ధితో ఏ కార్యక్రమం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవ్వటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని.. ఓటీఎస్ విషయంలో టీడీపీ ప్రజల్లో భయాలను సృష్టించాలని చూస్తోందని చెప్పారు.