విశాఖ ఉక్కు ఉద్యమం నానాటికి తీవ్ర రూపు దాలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనలు చేసినా, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో… ఆందోళనలను ఢిల్లీకి చేర్చారు కార్మిక సంఘాల నాయకులు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది కార్మికులు… హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటున్నారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలమని, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దని కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే కార్మికులు ప్రకటించారు. ఇందులో భాగంగానే విశాఖలో ర్యాలీలు, నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాజ్యసభలో ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈరోజు కూడా పార్లమెంట్‌లో మరోసారి స్పష్టంగా…
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్‌లో స్పష్టంచేసింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ప్రకటించింది. ఆర్చి నుంచి వడ్లపూడి నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం…
ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
విశాఖ ఉక్కు.. ఆంధ్రల హక్కు అంటూ ఓ వైపు పోరాటం జరుగుతున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలు కేంద్రంపై విమర్శలు పెంచాయి.. పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడే హక్కు ఏ పార్టీకిలేదన్నారు.. కేవలం రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం స్టీల్ ప్లాంట్ పై ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మాప్ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు, అభ్యంతరాలు తెలిపినప్పటికీ… పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. read aslo : మగువలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు విశాఖ స్టీల్ ప్లాంట్‌తో దాని అనుబంధ సంస్థలన్నీ వంద శాతం అమ్ముతామని కేంద్రం ప్రకటించింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్‌ను కూడా…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయిన తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని…రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని.. దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రయివేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్‌లో దర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి..? రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా..? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కేంద్రంపై…