విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ముందడుగు వేసింది. రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్స్ తొలి విడుతగా 51 లోకో వీల్స్ తయారీ చేసింది. లోకో వీల్స్ తయారీ కోసం రూ. 1700 కోట్లతో లాల్ గంజ్, రాయబరేలీలో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా నిన్న రాత్రి 51 లోకో వీల్స్‌ని ఇండియన్ రైల్వే కి వైజాగ్ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఆ నాటి నుంచి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. అంతేకాకుండా ఉద్యోగుల చేపట్టిన దీక్షలు, నిరసన కార్యక్రమాలకు విపక్షాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదు.