Bandi Sanjay: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, స్థానిక బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
Read Also: MP: భార్య వేధింపులు భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య.. వీడియో తీసి..
శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కోరారు. ఈ విషయం రాజకీయం చేయడం ఆపేయండని అన్నారు. బాబు కోలుకోవాలని ముందు కోరుకోండని తెలిపారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించాలని బండి సంజయ్ కోరారు.
Read Also: DK Shivakumar: రాబోయే సమావేశంలో దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వ్యూహరచన..
అల్లు అర్జున్‌ను, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం అత్యంత బాధాకరమని బండి సంజయ్ కుమార్ మధ్యాహ్నం మాట్లాడారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా సినిమా తరహాలో స్టోరీ అల్లడం విస్మయం కలిగిస్తోందని ఆరోపించారు. పనిగట్టుకుని ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు పవిత్రమైన శాసనసభను వేదికగా మార్చుకోవడం మంచిది కాదని వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తో పాటు సినిమా ఇండస్ట్రీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని బండి సంజయ్ తెలిపారు.