ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. విశాఖపట్నం మహానగరానికి సైతం తాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు.
కేవలం తాగు, సాగు నీరుతో పాటు చేపల పెంపకానికి, జలరవాణాకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా మిగులు జలాలను నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా నదితో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వస్తున్న అడ్డంకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమిస్తుంది. మరోవైపు కేంద్రం సవరించిన అంచనాల నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం కోరుతుంది.