Visakha Steel Plant: తెలుగు ప్రజల గుండె చప్పుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముంచేసే కుట్ర జరుగుతోందా..? ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనలు ఎలా ఉన్నా, తెరవెనుక ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చాప కింద నీరులా జరుగుతోందనే అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల పాటు దేశీయ ఉక్కురంగంలో తనదైన ముద్ర వేసి, నాణ్యతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఇప్పుడు ‘నాణ్యతా లోపం’…
గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు. నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్‌నగర్‌లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి…
నేడు గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల. ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభం. ఫేవరెట్‌గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి. కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా…
త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని…
విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార స్వామి బిజీబిజీగా గడిపారు. ఆయనతో పాటు.. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. ఆర్ఐఎన్ఎల్ (RINL) డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శనకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రేపు తొలి సారి ప్లాంట్ సందర్శన కోసం కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించబడింది. కోర్టు తన నిర్ణయంతో పాటు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని…
విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు.
నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ భేటీ కానుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ ఉపముఖ్యమంత్రిని కోరనుంది.