గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు.
నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్‌నగర్‌లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.
నేడు విజయవాడలో GFST టూరిజం కాంక్లేవ్. కాంక్లేవ్‌లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం గుంటూరుకు బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.
నేడు కాకినాడలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. బాబు ష్యురిటీల మోసం కార్యక్రమం ప్రచారంపై సమావేశం. పాల్గొననున్న రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ.
తూర్పుగోదావరి జిల్లా : నేడు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రి పర్యటన. భారీగా స్వాగత ఏర్పాట్లు. పుర వీధుల్లో గుర్రం బగ్గీలో షర్మిల ఊరేగింపుకు సన్నాహాలు. షర్మిలచే ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ. అనంతరం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులతో సమావేశం.
విశాఖ : నేటి నుంచి GVMC నీటి సరఫరా విభాగం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మె….. పెంచిన జీతాలు చెల్లింపులో జాప్యం ను నిరసిస్తూ విధులు బహిష్కరణ.. శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన GVMC.
విశాఖ: నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునః ప్రారంభం. మధ్యాహ్నం లాంఛనంగా కొలిమిని వెలిగించనున్న
కేంద్ర ఉక్కు సెక్రెటరీ సందీప్ పాండ్రిక్. రోజుకి 7వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయనున్న BF 3. వచ్చే నెల 10 నుంచి రానున్న ఉత్పత్తి.. BF 3 ఉత్పత్తి ప్రారంభమయ్యే రోజు స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి.
నేడు హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో భరోసా కార్యక్రమం. భరోసా కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ రఘునందన్. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో బీజేపీ నేతలు.
నేడు జగన్ క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్‌తో పాటు అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు. జగన్‌పై చర్యలు తీసుకోవద్దని కోరిన న్యాయవాదులు. ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వని ఏపీ హైకోర్టు.