విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు స్పందిస్తూ, కుమారస్వామి గురువారం ఎక్స్ ద్వారా వెల్లడించిన తన స్పందనలో, ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తోందనే ఆరోపణలు నిరాధారమని, సత్యదూరమని స్పష్టం చేశారు. Rashid Khan: ఘనంగా…
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నేతల వెల్లడించారు. వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానం పునరుద్ధరణ చేస్తామన్నారు.
హైకోర్టులో స్టీలు ప్లాంటు అమ్మకుండా ఉండటానికి ఆర్డర్ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. జస్టిస్ నరేంద్ర, జస్టిస్ న్యాపతిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్ళుగా స్టీల్ ప్లాంటు అమ్మకం జరగకూడదని పోరాడుతున్నానని కేఏ పాల్ అన్నారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఈవోఐ జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన…
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారు అని వ్యాఖ్యనించారు. నేను స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం న్యాయం పోరాటం చేస్తున్నాను..
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాల నాయకులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి వారికి మద్దుతు ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిశ్రమ సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత మరియు కృషిని కొనియాడుతూనే.. ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు.. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న…