Deputy CM Pawan Kalyan: నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ భేటీ కానుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ ఉపముఖ్యమంత్రిని కోరనుంది. ప్రయివేటీకరణ వ్యతిరేకించడం సహా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు కోరనున్నాయి. ప్లాంట్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కమిటీ కోరనుంది. రేపు ఢిల్లీలో స్టీల్, ఆర్థిక శాఖల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఆర్‌ఐఎన్‌ఎల్ ఇంఛార్జి సీఎండీ పాల్గొననున్నారు. ఢిల్లీ మీటింగ్‌కు ఒకరోజు ముందు కార్మిక సంఘాలతో పవన్ భేటీపై ఆసక్తి నెలకొంది.
Read Also: RK Roja: పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి