విశాఖ సీతమ్మధారలో 108 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. ఈ కార్యక్రమంలో… ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రతిష్టించారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ… విశాఖలో ఇంత పెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి, విశాఖ లో ఉన్న దేవతమూర్తులు విశాఖను కాపాడుతున్నారని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి.. ఆ దేవతమూర్తులు రక్షిస్తున్నారని…
పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..విశాఖ ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఓ వైపు అధికారులు దాడులతో వేల కిలోల స్వాధీనం చేసుకుంటున్నారు. మరో వైపు స్మగ్లర్లు గంజాయి చేరవేతకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. మనమంతా…
నాకు పదవి రావాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ.. నాకు రాకుంటే మాత్రం పక్కనేతకు రావొద్దని కోరుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. తన సంగతి అటుంచి ప్రత్యర్థికి ప్లస్ అయ్యే అంశాల టార్గెట్‌గా పావులు కదుపుతున్నారట. పైకి ఇకఇకలు.. పకపకలు.. వెనక మాత్రం వెన్నుపోట్లతో గట్టిగానే చెక్ రాజకీయం నడుపుతున్న ఆ నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అవంతిని మారిస్తే.. ఆయన స్థానంలో కేబినెట్‌లో ఎవరికి ఛాన్స్? విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో అమాత్య పీఠం కోసం…
విశాఖ : టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ కు బెయిల్ రద్దు అయింది. భార్గవ్ కు మరోసారి రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకున్న భార్గవ్… పెందుర్తి పిఎస్ కేసులో ఏప్రిల్ 18 న అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో జూన్ 15 న షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్ పై బయటకు వచ్చాక… షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్.…
విశాఖపట్నం…. చీకటి వ్యాపారాలకు రాచమార్గంగా మారింది. ఇతర దేశాలు,రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా.. నిషేధిత సరుకుల సరఫరా జరిగిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి కోట్లకు పడగలెత్తుతున్నాయి. బలహీనతను చంపుకోలేని జనం మాత్రం బలైపోతున్నారు.ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ ఫేక్ సిగరెట్ డంప్ బయటపడింది. కల్తీ సిగరెట్లు బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో…
విశాఖజిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి కలకలం రేపింది. పాయకరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులు.. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న ఉద్యోగి సత్యన్నారాయణ కారును అడ్డుకున్నారు. ఫీజ్ కట్టి వెళ్లాల్సినదేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇతర సిబ్బంది కూడా అక్కడకు చేరుకోవడంతో మాటమాట పెరిగి చివరకు గొడవకు దారి తీసింది.తమనే అడ్డుకుంటావా అంటూ అధికార పార్టీ…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే… విశాఖ టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం నుంచి విశాఖ బయలు దేరాల్సి ఉంది. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని ఎన్‌ఏడీ జంక్షన్ లో ఫ్లై ఓవర్ తో పాటు.. వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన 6…
పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది. సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి. విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు….సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజే…అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం…
వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో…
ఇటీవల ఎపి ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి కేంద్ర పెద్దలను కలసి వచ్చాక పాలనావికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల హడావుడి బాగా పెరిగింది. హోంమంత్రిఅమిత్‌షాను కలుసుకున్నప్పుడు ఇచ్చిన మెమోరాండంలో మొదటి అంశమే పాలనావికేంద్రీకరణ కావడం యాదృచ్చికం కాదు..దీనిపై ఢల్లీిపెద్దలు ఏ రూపంలోనూ ఎలాటి అభ్యంతరంగాని భిన్నాభిప్రాయం గాని వెలిబుచ్చలేదు సరికదా ముందుకు పొమ్మని పచ్చజెండా వూపినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుతో మొదలు పెట్టి వివిధ విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు…