విశాఖ : టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ కు బెయిల్ రద్దు అయింది. భార్గవ్ కు మరోసారి రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకున్న భార్గవ్… పెందుర్తి పిఎస్ కేసులో ఏప్రిల్ 18 న అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో జూన్ 15 న షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్ పై బయటకు వచ్చాక… షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్.
దీంతో భార్గవ్ పై మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమో లో పొందుపరిచారు పోలీసులు. దీంతో బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. రిమాండ్ లో భాగంగా ఫన్ బకెట్ భార్గవ్ ను సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.