పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్..బోసిపోయిన వైజాగ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో వారంతా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. సగానికి సగం ఫినాన్షియల్ గా ఇబ్బందులు పడుతూ.. మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
read also : కరోనా తగ్గుముఖం.. జులై 19 తరువాత అన్ని ఆంక్షలు ఎత్తివేత
Also Read
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
విశాఖకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరచూ వస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే వారిలో ఎక్కువమంది ఏజెన్సీ ప్రాంతాలను, జలపాతాలు, కొండ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో పొరుగు దేశాల నుంచి వందల మంది నగరంలోని టూరిజం స్పాట్స్ సందర్శనకు వస్తారు. కరోనా పుణ్యమా అని… రెండేళ్లుగా ఎవరూ రావడంలేదు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బుకింగ్ లతో బిజీబిజీగా ఉండే ట్రావెల్ ఏజెన్సీ లు… ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
సాధారణ రోజుల్లో నగరంలోని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులన్నీసందడిగా ఉండేవి. వాహనాల గిరాకీతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్యాకేజీలు నిర్వహించేవారు. కరోనా వల్ల జనం ఎంతో అత్యవసరమైతే తప్ప ఎక్కడా బయటకు వెళ్లడం లేదు. దూర ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పర్యాటక వ్యాపారాల మీద కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్యాటక సంస్థల నిర్వహణ, ఉపాధికల్పన భారంగా మారుతోంది. ఈ సమయంలో పన్ను విరమణ, ఇతర మినహాయింపులిచ్చి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు నిర్వాహకులు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!