విశాఖలో సైన్స్‌కు అందని అద్భుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది. సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి. విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు….సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజే…అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జలసమాధి అయ్యారు.
ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన 3 ఏళ్ల గీతావైష్ణవి, 18 నెలల ధాత్రి అనన్య మృతిచెందారు. బంగారు బొమ్మల్లాంటి పిల్లలను పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. అప్పటికే భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఇక పిల్లలు పుట్టరని కుంగిపోయారు. మళ్లీ పిల్లలు కావాలనే కోరికతో విశాఖలో ఓ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులను సంప్రదించారు. కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా భాగ్యలక్ష్మికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సాధా రణంగా అయితే ఇది సైన్స్ సాధించిన అద్భుతం. కానీ.. భాగ్యలక్ష్మి, అప్పల రాజులకు మాత్రం ఇది దేవుడిచ్చిన వరం. ఎందుకంటే మరణించింది ఇద్దరు ఆడపిల్లలు కాగా….ట్విన్స్ రూపంలో జన్మించింది కూడా ఆడపిల్లలే.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
అదీ ప్రమాదం జరిగిన రోజు…. అదే సమయానికి.ఇది నిజంగా మిరాకిల్ అంటున్నారు డాక్టర్లు. వాస్తవంగా భాగ్యలక్ష్మికి అక్టోబర్‌లో డెలివరీ అవ్వాల్సి వుంది. గత నెలలో ఒకసారి పురిటినొప్పులు వచ్చాయి. అయితే ప్రీమెచ్యూర్ కావడంతో జాగ్రత్తలు తీసుకుని పురుడు వాయిదా వేశారు వైద్యులు. సెప్టెంబర్ 15, సాయంత్రం సమయంలో ఆపరేషన్ చేసి ఇద్దరు ఆడపిల్లలను బయటకు తీశారు. ఏ సమయానికైతే అమ్మకు పిల్లలు దూరమయ్యారో అదే సమయాకి బిడ్డలు ఒడికి చేరడం నమ్మశక్యం కాని నిజం అంటున్నారు డాక్టర్లు. అద్భుతాలు జరిగేప్పుడు ఎవరు ఊహించరు. అదే భాగ్యలక్ష్మి, అప్పలరాజు విషయంలో జరిగింది. మెడికల్ సైన్స్ ఆ తల్లిదండ్రులకు కొత్త జీవితం ప్రసాధించింది.
- Tags
- Andhra Pradesh
- twins
- visaka
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!