యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 19 నుంచి టీ20 సిరీస్, అక్టోబర్ 29 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే వన్డే సిరీస్‌కు తమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం…
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అప్పుడే ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అభిషేక్ 900లకు పైగా రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదివరకు టీ20 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 900లకు…
టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నా.. కింగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అతడికి కోసం ఫాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. గుజరాత్‌కు చెందిన ఓ అభిమాని తన మొబైల్ కవర్‌పై బంగారంతో కింగ్ ఫోటో, పేరును వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్,…
Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆసియా కప్ 2025 నేటి నుంచే ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలవనుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆసియా జట్లు సిద్ధం కావడానికి ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.…
టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు.. వన్డేలకూ గుడ్‌బై చెప్పేశారా? అని అభిమానులు అయోమయానికి గురయ్యారు. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? అని బుధవారం అభిమానులు కాసేపు జోరుగా చర్చలు జరిపారు. ఇందుకు కారణం ఐసీసీ. ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్లే ఇద్దరి పేర్లు ర్యాంకింగ్స్ జాబితాలో కనిపించలేదని ఐసీసీ తర్వాత ప్రకటించింది. కాసేపటికి…
Virat Kohli is Fitness Benchmark for Team India: భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీ తోపు అని, భారత జట్టుకు మార్గదర్శి అని పేర్కొన్నారు. టెస్ట్ రిటైర్మెంట్ విషయంలో కింగ్ కాస్త తొందరపడ్డాడని, ఇంకొన్నేళ్లు విరాట్ టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందని రాయుడు అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.…
Virat Kohli: విరాట్ కోహ్లీ.. అది పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. టాప్ రేటెడ్ బ్యాట్స్‌మన్‌గా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో పేరుగాంచిన ఈ క్రికెటర్ 2008 లో అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ చేసి టీ20, టెస్ట్, ODIలో భారత జట్టు కోసం అనేక రికార్డులు సృష్టించారు. కోహ్లీ 2014 నుండి 2022 వరకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన…
Virat Kohli will play ODI World Cup 2027: టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా వన్డేలపై దృష్టి సారించాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడడంతో.. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో విరాట్ ఆడనున్నాడు. ఈ సిరీస్ విరాట్ కెరీర్‌కు చివరిది కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే తనలో ఇంకా ఆడే సత్తా ఇంకొన్నేళ్లు ఉందని కింగ్ ఓ…