RCB Star Virat Kohli Scripts History in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక…
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ క్రమంలో నేడు ఆర్సిబి తొలి గండాన్ని దాటేందుకు సిద్ధమయింది. నేడు రాత్రి జరగబోయే మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనుంది. Sachin – Ratan…
2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో పేలవ ప్రదర్శన చేసినందుకు బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆర్సిబి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ముఖ్యంగా, ఆర్సిబి ఐదు మ్యాచ్‌ల విజయ పరంపరతో ఫైనల్ కు చేరుకుంది. కాని కేవలం ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో వారి మొట్టమొదటి టైటిల్ ను గెలుచుకునే బంగారు అవకాశాన్ని కోల్పోయింది. Phone Use: ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని రాడ్‌తో కొట్టి…
Virat Kohli Meets MS Dhoni after RCB vs CSK Match: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. టాస్ నుంచే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఫినిషర్ ఎంఎస్ ధోనీని పెవిలియన్ చేర్చి.. అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం జరిగిన చివరి ఐపిఎల్ 2024 లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 27 పరుగుల తేడాతో విజయం సాధించి చివరి ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా వారి అద్భుతమైన ఆటను కొనసాగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరవ వరుస విజయం సిఎస్కెను ఏడు వికెట్లకు 191 పరుగులకే పరిమితం చేయడానికి ముందు బ్యాటింగ్ కు దిగిన తరువాత 218/5 పరుగులు చేసింది. ఈ విజయం 16 సీజన్లలో…
ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే అనుమానాలొచ్చేలా కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీతో ఈరోజు మ్యాచ్ ఆడుతున్నానని.. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో అని కోహ్లీ తెలిపారు. వచ్చే సీజన్ లో ధోనీ ఆడుతాడో, ఆడడో.. ఎవరికి తెలుసని పేర్కొన్నారు. అయితే.. ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు పండగేనని, అద్భుతమైన అనుభూతి ఇస్తుందని చెప్పారు. మేమిద్దరం కలిసి భారత్ తరఫున చాలా సంవత్సరాలు ఆడామని.. జట్టును ఎన్నోసార్లు…
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి గానీ.. అతని రికార్డుల గురించి గానీ తెలియని వారు ఎవరుండరు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే.. ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని చెప్పారు. ఇటీవల జియో సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. 2016లో జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో తన హార్ట్ బ్రేక్ అయిందని చెప్పుకొచ్చారు.…
భారత ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్‌బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్‌బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు…
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్ తరువాత తన ప్రణాళికలను వెల్లడించాడు. క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత తన తదుపరి దశలను ఆలోచించే ముందు సుదీర్ఘ విరామం తీసుకుంటానని తెలిపాడు. విరాట్ కోహ్లీ క్రికెట్లోనే కాకుండా మొత్తం క్రీడా ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడు. కోహ్లీ ప్రభావం ఎంత ఉందంటే., 2028 లాస్ ఏంజిల్స్ క్రీడల ఒలింపిక్ కార్యక్రమంలో క్రికెట్ ను చేర్చడంలో ఇది ఒక పాత్ర పోషించింది. సిఎస్కెతో కీలకమైన…
ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచరీ…