Virat Kohli: ఏంటి ‘కింగ్’ ఐపీఎల్లో అలా.. ఇక్కడేమో ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ తడబడ్డాడు. 5 బంతులు ఆడిన కోహ్లీ.. మార్క్ అడైర్ ఓవర్‌లో క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు.
Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ 50 కంటే తక్కువ పరుగులు సాధించడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2016లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్లో కోహ్లీ 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ 50 కంటే తక్కువ పరుగులు చేయలేదు. అయితే.. ఐపీఎల్ లో అదరగొట్టి, ఇప్పుడు బెదరగొడుతున్నందుకు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాతో పాటు అభిమానులు.. గేర్ మార్చాలని అంటున్నారు. కోహ్లీ బ్యాటింగ్ రికార్డు విషయానికొస్తే.. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఉంది. ఛేజింగ్‌లో అతడి సగటు ఏకంగా 180.66గా ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 542 పరుగులు సాధించాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 82 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 134.49గా ఉండగా.. 49 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి.
Chandrababu: ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా.. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2024కప్ న్యూయార్క్‌లో జరుగుతుంది. బుధవారం రాత్రి నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్లు చెలరేగడంతో.. టీమిండియా 8 వికెట్ల తేడాతో ప్రపంచ కప్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ రాణించడంతో భారత్ అలవోక విజయం సాధించింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!