Virat Kohli Records in T20 World Cup vs Pakistan: మరికొద్దిసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలు విరాట్ రికార్డులను నెట్టింట పోస్ట్ చేశాయి.
టీ20ల్లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీకి అసాధారణ రికార్డులు ఉన్నాయి. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఇతర జట్లపై మరే ఆటగాడికి సాధ్యం కానీ రికార్డులు విరాట్ పేరిట ఉన్నాయి. పాకిస్థాన్‌పై 5 మ్యాచ్‌లు ఆడగా.. మూడుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. పాక్‌పై అత్యధిక సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. 2012, 2016, 2022 ప్రపంచకప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీ అందుకున్నాడు.
Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో విరాట్ కోహ్లీ మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. 2007ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్‌లో మహ్మద్ అసిఫ్, ఫైనల్‌లో ఇర్ఫాన్ పఠాన్ అవార్డు అందుకోగా.. 2014లో అమిత్ మిశ్రా, 2021లో షాహిన్ అఫ్రిదిలు అందుకున్నారు. పాకిస్థాన్‌పై అయిదు ఇన్నింగ్స్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ప్రపంచకప్‌లో పాక్‌పై 308 సగటు కలిగిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. విరాట్ తన జోరును నేటి మ్యాచ్‌లోనూ చూపిస్తే టీమిండియా విజయం ఖాయం.