అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం సాయంత్రం అమెరికాకు బయలుదేరాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో కోహ్లి కనిపించాడు. అక్కడ అతను ఒక యువ అభిమానికి ఆటోగ్రాఫ్ చేశాడు. తమ పిల్లలు వామిక, అకాయ్ ల గోప్యతను గౌరవించిన ఫోటోగ్రాఫర్స్ కు కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ పంపిన బహుమతిలకు గాను మీడియా సిబ్బంది నుండి కృతజ్ఞతలు అందుకున్నాడు విరాట్.
Delhi: ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు.. సుప్రీంకోర్టు ఆవరణలో పక్షులకు ఆహారం, నీరు
ఎయిర్‌పోర్ట్ లో లేత గోధుమరంగు చొక్కా, టోపీ ధరించిన కోహ్లీతో కొంతమంది అభిమానులు ఫోటోలు అభ్యర్థించారు. జూన్ 25న న్యూయార్క్‌కు బయలుదేరిన తొలి భారత ఆటగాళ్లతో కోహ్లీ ప్రయాణించలేదు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తొలి బృందంలో ఉన్నారు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి జూన్ 29 వరకు జరుగుతుంది. పేపర్ వర్క్ సమస్యలు, కొన్ని పర్సనల్ కారణాల వల్ల కోహ్లీ ప్రయాణాన్ని ఆలస్యం అయిందని సమాచారం.
TGSRTC: 8వ తరగతి పాస్ అయ్యారా.. అద్భుత అవకాశం కల్పిస్తున్న టీజిఎస్ఆర్టిసి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత కోహ్లీ కూడా తన కుటుంబంతో గడిపాడు. అతను ఇటీవల శర్మ, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, అతని భార్య సాగరిక ఘట్గే, బ్రాడ్‌కాస్టర్ గౌరవ్ కపూర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కోహ్లి ఐపీఎల్ 2024 లో 15 మ్యాచ్‌ల్లో 714 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నా సంగంతి తెలిసిందే. ఇక జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో శిక్షణలో ఉన్న భారత జట్టు జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
Virat Kohli gave his autograph to a young fan at the Mumbai Airport before leaving for New York. ❤️👌pic.twitter.com/l5ezgKrNxh
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2024