IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్, సూర్య డుమ్మా!
- అమెరికా-భారత్ మ్యాచ్
- కోహ్లీ-రోహిత్ డుమ్మా
- వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్-8కు అర్హత సాధించనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.
అమెరికా మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు భారత స్టార్ ఆటగాళ్లు డుమ్మా కొట్టారు. కొందరు ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పడంతో.. చాలా మంది ప్లేయర్స్ మైదానంలోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయకుండా.. హోటల్ గదిలకే పరిమితమయ్యారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు రిసర్వ్ ప్లేయర్స్ మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. నిన్న రెస్ట్ తీసుకున్న ప్లేయర్స్.. నేడు సాధన చేయనున్నారట. మరోవైపు అమెరికా జట్టు సైతం, మంగళవారం ప్రాక్టీస్ చేయలేదు. ఈరోజు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వేశారు సాధన చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..