మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
READ MORE: Telangana DGP: పోలీసులు వద్దంటే వినాలి.. సినీ ప్రముఖులతో డీజీపీ..
ఆసీస్ 19 ఏళ్ల ఓపెనర్ కాన్‌స్టాస్ క్రీజ్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. బుమ్రా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో మూడు బాల్ వేశాడు. కోహ్లీ వద్దకు బాల్ వెళ్లింది. దానిని తీసుకుని నాన్‌స్ట్రైకర్ వైపు వస్తున్నాడు విరాట్..స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్న కాన్‌స్టాస్-విరాట్ భుజాలు తాకాయి. దీంతో కాన్‌స్టాస్ ఏదో అన్నాడు. ఆగ్రహానికి గురైన కోహ్లీ ఘాటుగా స్పందించాడు. కొంతసేపు వాగ్వాదం నెలకొనడంతో.. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వాగ్వాదం అనంతరం.. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొన్ని గంటల్లోనే ఐసీసీ స్పందించింది. కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది.
READ MORE: Plane Crash: విమానంపై రంధ్రాలు.. అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో కుట్రకోణం..?