Team India: వన్డే ఫార్మాట్‌లో టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే చరిత్రలో 300 వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 240 వ్యక్తిగత సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ 214 వ్యక్తిగత సెంచరీలతో మూడో స్థానంలో, 194 వ్యక్తిగత సెంచరీలతో వెస్టిండీస్ నాలుగో స్థానంలో, 191 వ్యక్తిగత సెంచరీలతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో, 188 వ్యక్తిగత సెంచరీలతో ఇంగ్లండ్ ఆరో స్థానంలో, 182 వ్యక్తిగత సెంచరీలతో శ్రీలంక ఏడో స్థానంలో, 144 వ్యక్తిగత సెంచరీలతో న్యూజిలాండ్ 8వ స్థానంలో, 72 వ్యక్తిగత సెంచరీలతో జింబాబ్వే 9వ స్థానంలో, 62 వ్యక్తిగత సెంచరీలతో బంగ్లాదేశ్ 10వ స్థానంలో కొనసాగుతున్నాయి.
Read Also: Indian Racing league: ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్.. విజేతగా కొచ్చి
కాగా శనివారం నాడు బంగ్లాదేశ్‌పై టీమిండియా రెండు సెంచరీలను నమోదు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయగా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా వన్డే సెంచరీల సంఖ్య 300కి చేరింది. అటు టీమిండియా సాధించిన 300 వన్డే సెంచరీలలో సచిన్‌వే ఎక్కువ ఉన్నాయి. ఈ జాబితాలో సచిన్ 49, కోహ్లీ 44, రోహిత్ శర్మ 29, గంగూలీ 22, ధావన్ 17, సెహ్వాగ్ 15, యువరాజ్ 14, రాహుల్ ద్రవిడ్ 12, గంభీర్ 11, ధోనీ 9 సెంచరీలు చేశారు. అటు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ట్రిపుల్ సెంచరీ చేయకపోవడంపై ఇషాన్ కిషన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఔట్ కాకపోయి ఉంటే.. ఖచ్చితంగా ట్రిపుల్ సెంచరీ చేసేవాడినని చెప్పాడు. తాను అవుటయ్యే సమయానికి ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయని గుర్తుచేశాడు. వన్డే ఫార్మాట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయినందుకు కొంత అసంతృప్తిగా ఉందని ఇషాన్ కిషాన్ అభిప్రాయపడ్డాడు.
Read Also: Virat Kohli: పేరు మార్చుకున్న విరాట్ కోహ్లీ.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు