కాపలాగా ఉండాల్సిన ఓ శునకం యజమానికి తిప్పలు తెచ్చిపెట్టింది. యజమానే శునకానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలోని కారటిగి పట్టణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాపలాగా ఉంటుందని చెప్పి 5వేలు పెట్టి ఓ శునకాన్ని తెచ్చుకున్నాడు. అయితే, ఆ శునకం ఏకంగా యజమాని బంగారం గొలుసును మింగేసింది. గొలుసు కనిపించకపోవడంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు. చివరకు కుక్కను కట్టేసిన ప్రాంతంలో చిన్నచిన్న బంగారం ముక్కలు కనిపించడంతో షాక్ అయ్యాడు. తరువాత రోజు ఆ కుక్క మలపదార్ధంలో కొన్ని బంగారం ముక్కలు బయటపడ్డాయి. దీంతో మిగిలిన బంగారం కోసం కుక్కదగ్గర పాపం కాపలా కూర్చుంటున్నాడట దిలీప్.