పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్‌బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్‌బో స్నేక్ చూడటానికి బ్లూకలర్‌లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ రంగులు మారుతుంటుంది. అమెరికాలోని రెప్టైల్ జూలో ఈ పామును తన భుజాలపై ఉంచుకొని ఫోజులు ఇచ్చింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.