ప్రపంచంలో ఎక్కువమంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో దొరికే చేపలను పట్టుకొని జీవిస్తుంటారు. అయితే, ప్రతిరోజూ సముద్రంలో అద్భుతాలు జరుగుతాయని అనుకోకూడదు. ఒక్కోసారి అదృష్టం అలా కలిసి వస్తుంది. నిత్యం సముద్రంలో చేపలు పట్టుకొని జీవించే ఓ మత్స్యకారుడి వలకు ఓ పెద్ద చేప దొరికింది. ఆ చేపను పడవలోని బల్లపై ఉంచి కత్తిలో కోశాడు. చేప కడుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండగా అతడికి ఓ బాటిల్ దొరికింది. దాన్ని చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు. ఫుల్ విస్కి బాటిల్ కావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబందించిన వీడియోను టిక్‌టాక్ యూజర్ బెనిబాన్ షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
Read: ‘ఆహా’లో ఈ వారం ఒకటి కాదు రెండు!