కరోనా మహమ్మారికి ఎక్కడ ఎలాంటి మందు ఇస్తున్నారని తెలిసినా అక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నారు ప్రజలు. ఆనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందిని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నాగన్న పసరు పంపిణీని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పసరును ప్రజలకు ఎలా సరఫరా చేస్తారని ఆగ్రహం…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు…
మే 24 ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు తమ తమ బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు సైతం సోదరుల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా తన తమ్ముళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ బ్లాక్…
భూకంపం వచ్చినపుడు భవనాలు ఊగిపోతుంటాయి. నేలమట్టం అవుతుంటాయి. ఆకాశాన్ని తాకే భవనాల్లో ఉండే ప్రజలు భూకంపం వచ్చినపుడు బయటకు పరుగులు తీస్తుంటారు. భూకంపం నుంచి తట్టుకునే విధంగానే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తుంటారు. అయితే, చైనాలోని షెన్ జెన్ నగరంలో ఉన్న 72 అంతస్తుల సెగ్ ప్లాజా భవనం ఉన్నట్టుండి ఊగిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో ఎలాగైతే భవనాలు ఊగిపోతాయో అలా ఊగిపోయింది. దీంతో ఆ భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనం ఊగిపోవడంతో మొత్తం ఉద్యోగులను…
భారత దేశంలో పురాతన కాలం నుంచి కొన్ని రకాల ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. ఈ శ్రార్ధ కర్మల్లో పిండ ప్రధానం ప్రధానమైనది. పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయి. కానీ, పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ కారణంగా కాకులు అంతరించిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన దీనిని ఉపాధిగా మార్చుకున్నాడు. రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు. …
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనం చేస్తూ దొరికిపోతే దానికంటే అవమానం ఏముంటుంది. పంజాబ్ లోని పతేఘర్ సాహిబ్ టౌన్ లోని ఓ పోలీసు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రోడ్డుపై పెట్టిన కోడిగుడ్ల బండి వద్దకు వెళ్లిన పోలీస్ అందులోనుంచి కొన్ని గుడ్లను తీసుకొని జేబులో వేసుకున్నాడు. బండి డ్రైవర్ రాగానే తనకేమి తెలియనట్టు అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోడిగుడ్ల…
ఈనెల 8 వ తేదీన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు. కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నది. …
రెండో ఎక్కం ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు. అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. …
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్లు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ల పై అనేక మందికి అనేక అపోహలు ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరిగింది. సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక వ్యాక్సిన్ పై ఓ బామ్మ అవగాహన కల్పిస్తూ…
కేరళలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు 30 వేలకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళ, సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడిపోతుంది. కరోనా నుంచి బయటపడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోలీసులు సిద్ధమయ్యారు. ఇటీవలే బాగా పాపులర్ అయిన ఎంజాయి ఎంజామి అనే సాంగ్ ను కరోనా మహమ్మారికి తగిన విధంగా రీమిక్స్ చేసి దానికి తగిన విధంగా పోలీసులు స్టెప్పులు వేసి సోషల్…